- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CMRF : సీఎంఆర్ఎఫ్ లో తెలంగాణ ప్రభుత్వం కొత్త రికార్డు
దిశ, వెబ్ డెస్క్ / తెలంగాణ బ్యూరో : సీఎంఆర్ఎఫ్(CMRF) పథకంలో ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే దాదాపు రూ.830 కోట్లు సీఎంఆర్ఎఫ్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 1,66,000 పేద, మధ్యతరగతి కుటుంబాలు సీఎంఆర్ఎఫ్తో లబ్ధి పొందాయని ఆదివారం సీఎంవో(CMO) వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. 2018 నుంచి 2023 వరకు అయిదేళ్లలో అప్పటి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2400 కోట్లు మాత్రమే సాయం అందించిందని, అంటే సగటున ఏడాదికి రూ.480 కోట్లు ఖర్చు పెడితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఒక్క ఏడాదిలోనే రూ.830 కోట్లు సాయం అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారని వివరించారు. ఈ ఏడాది విడుదల చేసిన రూ.810 కోట్లలో ఇప్పటికే రూ.590 కోట్లు సీఎంఆర్ఎప్ ద్వారా సాయం అందించటం గమనార్హం. ఆరోగ్య శ్రీ పరిధిలో లేని చికిత్సలు, ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు ఖరీదైన వైద్యం అందించేందుకు ప్రజా ప్రతినిధుల సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ సాయం అందిస్తుంది.
జిల్లా స్థాయిలో అవసరమైన వైద్య చికిత్స సదుపాయం లేని పరిస్థితుల్లో నిమ్స్ తో పాటు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి, నిలోఫర్, ఈఎన్ టీ, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో సీఎంఆర్ ఎఫ్ద్వారా చికిత్సను అందిస్తున్నారు. ఇందుకు అయ్యే అంచనా ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. సీఎం సహాయ నిధి నుంచి సంబంధిత ఆసుపత్రికి ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) జారీ చేస్తుంది. ఈ ఏడాదిలోనే 13 వేల మందికి ఎల్ వోసీ లు జారీ చేసింది. సుమారు రూ. 240 కోట్ల ఎల్‌వోసీలు మంజూరు చేశారు. ఇందులో అత్యధికంగా చిన్న పిల్లలకు అవసరమయ్యే ఆపరేషన్లు, చికిత్సలకు కేటాయించారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఎల్వోసీ ఇచ్చే ఏర్పాట్లు చేసింది. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయవద్దని, ఆదివారంతో పాటు సెలవు దినాల్లో కూడా ఎల్‌వోసీలు క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించటం గమనార్హం.
ఇక గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్ నిధులకు కూడా అవినీతి చీడ పట్టుకున్నదని సీఎంవో పేర్కొన్నది. కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంఆర్ఎఫ్ అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లు స్పష్టం చేసింది.మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా దరఖాస్తుదారులే తమ సీఎంఆర్‌ఎఫ్ సాయం ఏ దశలో ఉన్నదో, ఎప్పటికప్పుడు స్టేటస్‌ను తెలుసుకునేలా ఆన్‌లైన్ వ్యవస్థను రూపొందించినట్లు వివరించారు. మోసాలకు చెక్ పేట్టేందుకు ఏకంగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కులపై లబ్దిదారుల పేర్లతో పాటు వారి బ్యాంక్ ఖాతా నంబర్‌ను రేవంత్ సర్కారు ముద్రిస్తోందని స్పష్టం చేసింది. పుట్టుకతోనే ఈఎన్‌టీ(మూగ, చెవుడు) సమస్యలతో పుట్టే పిల్లలకు 6 ఏండ్ల లోపల శస్త్రచికిత్సలు చేయించాల్సి ఉంటుంది.ఈ ఆపరేషన్ల ఖరీదు లక్షల్లో ఉండడంతో పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఆపరేషన్లు చేయించుకోలేకపోతున్నారు. ఈ విషషం తెలుసుకున్న సీఎం , ఎల్‌వోసీలు ఇచ్చి అటువంటి పిల్లలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 87 మంది పిల్లలకు ఎల్‌వోసీ ఇచ్చి ఆపరేషన్లు ఇచ్చారు. ఇది తమ పిల్లలకు రేవంతన్న ఇచ్చిన పునర్జన్మ అని పిల్లల తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- cmrf fund