- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్నికల మూడ్‌లో సర్కార్.. మంత్రులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు!
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ఎన్నికల మూడ్ లోకి వచ్చేసింది. దీంతోనే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఎన్నికలు వచ్చేలోపు పెండింగ్ పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అన్ని శాఖ మంత్రులకు ఆదేశాలిచ్చారు. దీంతో మంత్రులంతా హుటాహుటిన ఆయా శాఖల అధికారులతో రివ్యూలు మొదలు పెట్టారు. అభివృద్ధి కనిపించేలా ప్రధానంగా రోడ్లు, దవాఖాన్లపై ఫోకస్ పెట్టారు. పాత రోడ్లకు మరమ్మతులు చేస్తూ, కొత్త రోడ్ల కోసం ప్రపోజల్స్ పెట్టాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. దీంతో పాటు ఆస్పత్రుల అప్ గ్రేడేషన్, మరమ్మతులపై కూడా ఫోకస్పెట్టింది. ఆర్అండ్బీ, హెల్త్ విభాగాల్లో డెవలప్ మెంట్ చేస్తే ఎక్కువ మంది ప్రజల మన్ననలు పొందవచ్చని సర్కారు భావిస్తున్నది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ఇదే తరహాలో ప్లాన్ ను అమలు చేసినట్లు ఆర్అండ్ బీకి చెందిన ఓ అధికారి తెలిపారు.
నిత్యం వినియోగంలో వచ్చేవి..
ప్రజలకు నిత్యావసరాలుగా మారిపోయిన రోడ్లు, ఆస్పత్రుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.2858 కోట్లను మంజూరు చేసింది. వీటిలో ఇప్పటికే రూ.518 కోట్లతో 1393 కిలోమీటర్ల పొడవు గల రోడ్ల మరమ్మతులు పూర్తి చేశారు. మరో రూ.1,223 కోట్ల రూపాయలతో చేపడుతున్న 455 రోడ్ వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ కేవలం 45 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆర్ అండ్ బీ శాఖకు టాస్క్ ఇచ్చింది. దీంతో పాటు ప్రజలకు సమీపంలో నాణ్యమైన ఆస్పత్రులు ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. మల్టీ లెవల్ వైద్యం అందించేందుకు సర్కార్ జిల్లాకో మెడికల్ కాలేజీ ప్లాన్తో ముందుకు సాగుతున్నది. వీటిలో ఇప్పటికే మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట్, మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సంగారెడ్డిలోని కాలేజీలు ప్రారంభ అయ్యాయి.
2023–24 అకడమిక్ ఇయర్‌లో జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలను నిర్మించనునున్నారు. వీటి నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కరీంనగర్, భూపాలపల్లి మినహా నేషనల్ మెడికల్ కమిషన్ అన్ని కాలేజీలకు అనుమతులు ఇచ్చేసింది. త్వరలో ఈ రెండింటికీ వచ్చే అవకాశం ఉన్నదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. వీటిని కేవలం రెండు నెలల్లో ఎస్టాబ్లిష్ చేయాలని సర్కారు మెడికల్ డిపార్ట్ మెంట్ కు ఆదేశాలు ఇచ్చింది. రోడ్ల మరమ్మతులు జరగడం వలన అనుకున్న గమ్యానికి వేగంగా చేరవచ్చు. ప్రజలకు కూడా ఎలాంటి అసౌర్యాలు కలగదు. దీంతోపాటు ఆస్పత్రి నిర్మాణాలు పూర్తయితే పేషెంట్లకు కూడా వైద్యసేవలు వేగంగా అందుతాయి. దీని వలన మెరుగైన వైద్యాన్ని ప్రజలు సులువుగా పొందే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారడమే కాకుండా తమకు మంచి పేరు తెస్తుందని సర్కారు భావిస్తున్నది.
Read more: