అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

by Satheesh |   ( Updated:2023-08-25 15:12:36.0  )
అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, హెల్పర్ల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 65 ఏళ్లకు పెంచారు. ఉద్యోగ విర‌మ‌ణ చేసే అంగ‌న్‌వాడీ టీచ‌ర్లకు రూ. ల‌క్ష, మినీ అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, హెల్పర్లకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించ‌నున్నారు. టీచ‌ర్లు, హెల్పర్లు ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అనంత‌రం ఆస‌రా పెన్షన్లు మంజూరు చేయ‌నున్నారు. రాష్టంలో 3,989 మినీ అంగ‌న్‌వాడీ కేంద్రాల స్థాయిని పెంచి వాటిని ప్రధాన అంగ‌న్‌వాడీ కేంద్రాలుగా మార్చారు. ఈ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్యవ‌తి రాథోడ్ కృత‌జ్ఞత‌లు తెలిపారు.

Advertisement

Next Story