రాజ్‌భవన్‌ రూటే సెపరేట్.. కేసీఆర్ కంటే ముందే తమిళిసై జాతీయ పతాకావిష్కరణ!

by Satheesh |
రాజ్‌భవన్‌ రూటే సెపరేట్.. కేసీఆర్ కంటే ముందే తమిళిసై జాతీయ పతాకావిష్కరణ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల పాటు నిర్వహించే అవతరణ ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఫస్ట్ టైమ్ రాష్ట్రంలోనే అధికారికంగా ఈ ఉత్సవాలను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నది.

ఈ రెండూ కొనసాగుతుండగానే గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అదే రోజు ఉదయం 9.00 గంటలకు రాజ్‌భవన్‌లో విడిగా ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించనున్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. ఆ తర్వాత 10 గంటల నుంచి ఒక గంట పాటు శుభాకాంక్షలు తెలియజేయడానికి టైమ్ రిజర్వు చేసుకున్నారు. సాధారణ ప్రజానీకంతో పాటు వివిధ ప్రజా సంఘాలు, ఆర్గనైజేషన్లు, సొసైటీల ప్రతినిధులు రావచ్చని రాజ్‌భవన్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed