విద్యార్థులకు బిగ్ అలర్ట్.. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్.. పూర్తి వివరాలు ఇవే..!

by Satheesh |
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్.. పూర్తి వివరాలు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఈ సారి మొత్తం మూడు విడతల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ జరగనున్నట్లు వెల్లడించిన అధికారులు.. జూన్‌ 27 నుంచి కౌన్సెలింగ్‌ ప్రాసెస్ ప్రారంభం అవుతుందని తెలిపారు. జూన్‌ 30 నుంచి మొదటి విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇవ్వగా, జులై 12న తొలి విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. జూన్‌ 19 నుంచి ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. జులై 24న ఇంజినీరింగ్‌ రెండోవిడత సీట్ల కేటాయిస్తామన్నారు. జులై 30 నుంచి ఇంజినీరింగ్‌ తుది విడత కౌన్సెలింగ్‌ నిర్వహించి, ఆగస్ట్‌ 5వ తేదీన తుది విడత సీట్ల కేటాయింపు చేస్తామని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

కాగా, రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించిన విషయ తెలిసిందే. ఈ నెల 7, 8 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి పరీక్షలు నిర్వహించగా.. 9, 10, 11 తేదీల్లో జరిగే ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు కండక్ట్ చేశారు. ఈ నెల 18వ తేదీన ఫలితాలు విడుదల చేశారు. తాజాగా కౌన్సిలింగ్‌కు షెడ్యూల్ రిలీజ్ చేశారు. కాగా, ఈఏపీసెట్‌కు మొత్తం 3,54,803 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed