- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షాకాలం వచ్చేసింది.. వాహనదారులు జాగ్రత్త: తెలంగాణ డీజీపీ
దిశ, డైనమిక్ బ్యూరో: వర్షాకాలంలో వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ డీజీపీ రవి గుప్త సూచించారు. ఈ మేరకు ఇవాళ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలన్నారు. తమ వాహనాల టైర్ల గ్రిప్ /థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోవాలన్నారు. టైర్ల గ్రిప్ బాలేకపోతే వెంటనే మార్చుకోండని సూచించారు. మీ వాహన టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నారు.
వర్షం కురుస్తున్నప్పుడు పరిమిత వేగంతో ప్రయాణించడం ఎల్లవేళలా మంచిదన్నారు. మీ వాహన ఇంజిన్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలని, బ్రేక్స్ పాడ్స్, విండ్ స్క్రీన్ వైపర్ల కండిషన్ ఒకటికి రెండుసార్లు చెక్ చేయించాలన్నారు. ఎప్పుడైనా అవసరం వస్తే మీ వాహనాల్లో ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని వెల్లడించారు. అత్యవసర సమయాల్లో #Dial 100 కి కాల్ చేసేలా మీ మొబైల్/ మీ వాహనంలో వీలైతే స్పీడ్ డయల్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మీకు, మీ కుటుంబ భద్రత దృష్ట్యా ఈ సూచనలు ఎంతో మంచివని ట్విట్టర్ వేదికగా సూచనలు పోస్ట్ చేశారు.