టీ.కాంగ్రెస్‌లో కష్టపడ్డ వారికి విలువ లేదు.. సొంత మహిళా నేత భావోద్వేగం

by Gantepaka Srikanth |
టీ.కాంగ్రెస్‌లో కష్టపడ్డ వారికి విలువ లేదు.. సొంత మహిళా నేత భావోద్వేగం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి విలువ లేదని ఆవేదన చెందారు. రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా తనను తప్పించాలని చూస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే గోషామహాల్ సీటు తనకు కేటాయించి చేతులు దులుపుకున్నారని వెల్లడించారు. తనకు బీజేపీలో చేరాలని రిక్వెస్టులు వచ్చినా చేరలేదు అని స్పష్టం చేశారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్న నారీ న్యాయ్ తెలంగాణలో లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు పార్టలో మొదటి నుంచి జెండా మోసిన వారికి న్యాయం జరుగడం లేదని ఆరోపించారు. కాగా, టీపీసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 2021 జూన్‌లో సునీత రావు నియమించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రక్షాళనలో భాగంగా నూతన మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలి ఎంపికపై కూడా కసరత్తు చేసి చివరికి సునీత రావును ఎపింక చేసింది కేంద్ర నాయకత్వం. కాగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Advertisement

Next Story

Most Viewed