మావోయిస్టులకు తెలంగాణ కాంగ్రెస్ సంచలన పిలుపు

by Gantepaka Srikanth |
మావోయిస్టులకు తెలంగాణ కాంగ్రెస్ సంచలన పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయస్టు పార్టీ(Maoist Party) నేతలకు తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సంచలన పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని అన్నారు. నక్సలిజం ఇప్పుడు లా అండ్ ప్రాబ్లంగా మారిందని.. అందుకే వారిని జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నిక(GHMC Elections)ల్లో నగరంలో కాంగ్రెస్ జెండగా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుండి హైదరాబాద్‌కు నయా పైసా తీసుకురాని ఇద్దరు కేంద్రమంత్రులు మన రాష్ట్రంలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని.. ఆ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం ఈ ఇద్దరు కేంద్రమంత్రులు చేయకపోగా.. వచ్చేవి కూడా రానివ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కులగణన పరి పూర్ణంగా జరిగిందని అన్నారు.

కులగణన రిపోర్టుపై పిబ్రవరి 5వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం(Cabinet Sub Committee Meeting) ఉంటుందని చెప్పారు. సంవత్సరకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ ఫలాలు అందరికీ అందుతున్నాయని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈసారి కాంగ్రెస్ సత్తా అంటే ఏంటో చూపిస్తామని అన్నారు. మెట్రో విస్తరణ పనులు, ఫోర్త్ సిటీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన(Musi Cleansin)తో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టబడులు వచ్చాయని తెలిపారు. కావాలనే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారని.. రియల్ ఎస్టేట్ ఏం పడిపోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వా(Congress Govt)నికి అన్ని వర్గాల వనుంచి వస్తో్న్న ఆదరణ చూసి కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజల్లో నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల పెంపు తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లాగా తాము అబద్ధాలు చెప్పబోము అని.. అలా చేతులెత్తేసే బ్యాచ్ తాము కాదని అన్నారు.

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ(Graduate MLC) ఎంపికపై ముగ్గురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల అభిప్రాయం ప్రకారం అభ్యర్థి ఎంపిక జరుగుతుందని అన్నారు. ముగ్గురు షార్ట్ లిస్ట్‌తో ఇప్పటికే ఏఐసీసీకి లిస్ట్ పంపించినట్లు తెలిపారు. అభ్యర్థి ఎంపికపై ఏఐసీసీ(AICC) తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. టీచర్ ఎమ్మెల్సీపై వచ్చే నెల 3వ తేదీన సమావేశం ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్(BRS) హయాంలో అభివృద్ధి జరుగలేదని.. అంతా దోపిడీ జరిగిందని ఆరోపించారు. అన్ని సౌలభ్యాలు ఉన్న సెక్రటేరియట్‌ను ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. కొత్తది కట్టాల్సిన అనివార్య పరిస్థితులు ఏమొచ్చాయని అన్నారు. త్వరలో సూర్యాపేట జిల్లా‌లో రాహుల్ గాంధీ సభ ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, పార్టీ జాతీయ నాయకులు పాల్గొంటారని అన్నారు. జగ్గారెడ్డిని మూడేండ్లు నెగ్గుకుంటూ వచ్చాము. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ మీద అభిమానం ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేయని రుణమాఫీని తాము సంవత్సర కాలంలో చేసి చూపించామని అన్నారు.


Next Story

Most Viewed