Ramdev: రాందేవ్ బాబా వర్సెస్ బ్రియాన్ జాన్సన్.. పతంజలి ఉత్పత్తులపై సోషల్ మీడియా వార్

by Shamantha N |
Ramdev: రాందేవ్ బాబా వర్సెస్ బ్రియాన్ జాన్సన్.. పతంజలి ఉత్పత్తులపై సోషల్ మీడియా వార్
X

దిశ, నేషనల్ బ్యూరో: యోగా గురు రాందేవ్ బాబా, యాంటీ ఏజింగ్ మిలియనీర్ బ్రియాన్ జాన్సన్ మధ్య సోషల్ మీడియా యుద్ధం నడుస్తోంది.రోగనిరోధక శక్తి, స్టామినా పెంచి వయసు పెరగడాన్ని నివారిస్తుందని పతంజలి ఉత్పత్తులపై ప్రచారం చేస్తూ రాందేవ్ బాబా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. గుర్రంతో పాటుగా పరిగెడుతున్నట్లు వీడియోను జతచేశారు. “మీరు గుర్రంలా పరిగెత్తాలనుకుంటే, బలమైన రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే, యాంటీ ఏజింగ్‌ను పెంచాలనుకుంటే స్వర్ణ శిలాజిత్, ఇమ్యునోగ్రిట్ గోల్డ్‌ను వాడండి" అని పతంజలి ఉత్పత్తులపై రాందేవ్ బాబా సోషల్ మీడియా వేదికగా పబ్లిసిటీ చేశారు. అయితే, ఆ ట్వీట్ పై బ్రియాన్ లారా విమర్శలు గుప్పించారు. ఈ ఉత్పత్తులు తయారు చేస్తున్న హరిద్వార్ లో గాలి నాణ్యత చాలా పేలవంగా ఉందని చురకలు అంటించారు. దాని రాందేవ్ బాబా వీడియోని ట్యాగ్ చేశారు. ఆ ప్రాంతంలో గాలి నాణ్యత పేలవంగా ఉందని శ్వాస తీసుకోవడం వల్ల హృద్రోగ, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని బ్రయాన్ జాన్సన్ ఎత్తి చూపారు. అంతేకాకుండా, ఈ ఘటన తర్వాత రాందేవ్ తనను బ్లాక్ చేసినట్లు మరో ట్వీట్ చేశారు.

గాలి నాణ్యతపై..

మరోవైపు, భారతదేశంలోని వాయు కాలుష్యంపై ఆందోళనలను ఉటంకిస్తూ నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్ నుండి బ్రియాన్ జాన్సన్ అకస్మాత్తుగా వెళ్లిపోయారు. యాంటీ-ఏజింగ్ ట్రీట్మెంట్ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న మిలియనీర్ బ్రియాన్ జాన్సన్.. భారత్ లో కొద్దిసేపు ఉండటంతోనే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఇక్కడి గాలినాణ్యత వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు. అప్పట్నుంచి ఆయన దేశంలో క్షీణిస్తున్న గాలి నాణ్యతను ఆయన పదేపదే హైలైట్ చేశారు.



Next Story

Most Viewed