తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఫస్ట్ రియాక్షన్

by Gantepaka Srikanth |
తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఫస్ట్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ నియామకం అయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా.. తన నియామకంపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నాపై అత్యంత నమ్మకంతో నాకు కీలకమైన టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంట్ ప్రతి పక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, డీసీసీ అధ్యక్షులకు, పార్టీ కోసం అనునిత్యం పాటు పడుతున్న నాయకులకు, కార్యకర్తలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

పార్టీ అప్పగించిన ఈ గొప్ప బాధ్యతలను చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తాను. నిరంతరం కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసి రాష్ట్రాభివృద్ధికి, పార్టీ పటిష్టతకు కృషి చేస్తా. ఇంతకాలం నాకు అన్ని రకాలుగా సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. నాకు పదవి రావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు’ అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed