- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cabinet meeting: ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25న అసెంబ్లీ, మండలిలో ప్రస్తుత వార్షిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున మంత్రివర్గ సమావేశాన్ని అసెంబ్లీ కమిటీ హాల్‌లోనే నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేబినెట్ బడ్జెట్‌పై చర్చించి ఆమోదం తెలపనున్నది. ఆ తర్వాత అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా (డిప్యూటీ సీఎం కూడా) మల్లు భట్టి విక్రమార్క, కౌన్సిల్‌లో మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు. ప్రతీ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున కేవలం సింగిల్ పాయింట్ ఎజెండాతో అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్ భేటీ కావడం ఆనవాయితీ. ఈసారి కూడా అదే కొనసాగనున్నది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ఈ నెల 23న ప్రారంభం (అసెంబ్లీ) ప్రారంభం కాగానే సికింద్రబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్య నందిత మృతికి సంతాపం తెలియజేసిన వెంటనే వాయిదా పడుతుంది. శాసనమండలి మాత్రం ఈ నెల 24న భేటీ కానున్నది. మరుసటి రోజున ఉభయ సభల్లో వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈసారి బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతున్నది.
Read More..
Rajiv Civils Abhaya Hastham: వీరికి రూ.లక్ష స్కీమ్ వర్తించదు.. సివిల్స్ అభయహస్తం అర్హతలు ఇవే!