సీఎం రేవంత్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం.. హైడ్రా బలోపేతంపై చర్చ

by Mahesh |
సీఎం రేవంత్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం.. హైడ్రా బలోపేతంపై చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం కొనసాగుతూనే ఉంది. దాదాపు రెండు గంటలుగా ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. ఇందులో.. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తలెత్తిన వరదలు, వరదలపై కేంద్ర ప్రభుత్వ సాయంపై చర్చించారు. అలాగే ఇటీవల రాష్ట్రంలో సంచలనంగా మారిన హైడ్రా బలోపేతంపై కూడా కేబినెట్‌ మీటింగ్‌లో చర్చించినట్లు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలోని మూడు యూనివర్సిటీలకు పెట్టే పేర్ల పై చర్చ జరగ్గా.. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు, హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయించారు. కాగా మూడు యూనివర్సిటీల పేర్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Next Story