జోరు పెంచనున్న టీ బీజేపీ.. వచ్చే నెలలో 40 బహిరంగ సభలకు సర్వం సిద్దం

by Javid Pasha |
జోరు పెంచనున్న టీ బీజేపీ.. వచ్చే నెలలో 40 బహిరంగ సభలకు సర్వం సిద్దం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచాలని నిర్ణయించింది. నేతలు, పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల వేళ బీజేపీ సైలెంట్ కావడం, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ఆ పార్టీ శ్రేణలు కాస్త డీలాపడ్డాయి. కానీ ఇక నుంచి మళ్లీ యాక్టివ్ కావాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా బహిరంగ సభలతో హోరెత్తించేందుకు సిద్దమవుతోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించింది.

అక్టోబర్‌లో ఏకంగా 30 నుంచి 40 బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ సిద్దమవుతుంది. ఈ సభల్లో కేంద్రమంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలు పాల్గొనేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అన్ని జిల్లాలను కవర్ చేసేలా సభలను ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1న జరిగే సభలో తెలంగణ ఎన్నికలకు మోదీ సమరశంఖం పూరించనున్నారు. 7వ తేదీన ఆదిలాబాద్‌లో కేంద్రం హోమంత్రి అమిత్ షా సభ ఉండనుంది. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు కనిపిన్నాయి. దీంతో బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ యోచిస్తోంది.

ఈ బహిరంగ సభల ద్వారా శ్రేణులను ఎన్నికలకు సిద్దం చేయడంతో పాటు ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు ప్రవేశపెడతామనేది బీజేపీ వివరించనుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించనున్నారు. మొత్తానికి ఈ సభల ద్వారా రాజకీయ వేడి పెంచాలని బీజేపీ చూస్తోంది.

Advertisement

Next Story

Most Viewed