- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana BJP: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు?.. పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ
దిశ, తెలంగాణ బ్యూరో: సంస్థాగత ఎన్నికలపై బీజేపీ(Telangana BJP) ఫోకస్ పెట్టింది. బూత్ స్థాయి నుంచి మొదలుకుని రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడి వరకు ఎన్నికల ప్రక్రియ ద్వారా నియామకం జరగనుంది. అందులో భాగంగా పార్టీ ఈ కసరత్తును ముమ్మరం చేసింది. హైకమాండ్ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు బూత్ కమిటీల నియామకం పూర్తిచేయాలని భావిస్తున్నది. ఈ నెల 27న రాష్ట్రస్థాయి కార్యశాల నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నది. అలాగే వచ్చే నెలలో జిల్లాస్థాయి కార్యశాలలు ఏర్పాటు చేయాలని చూస్తున్నది. ఇప్పటికే జాతీయ, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారులను హైకమాండ్ నియమించింది. డిసెంబర్ నెలాఖరున రాష్ట్ర అధ్యక్ష పదవికి, జనవరిలో జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగే అవకాశముంది.
రాష్ట్ర అధ్యక్షుడిపై ఉత్కంఠ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారనే ఉత్కంఠ కాషాయ శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే.. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే ముఖ్య నేతలంతా లాబీయింగ్ చేస్తున్నారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికలకు ముందే జాతీయ అధ్యక్షుడి పదవీకాలం ముగిసింది. కానీ.. ఎలక్షన్ నేపథ్యంలో పొడిగించారు. ప్రస్తుతం పార్టీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై దృష్టి సారించింది. వాటితోపాటే సంస్థాగత ఎన్నికలపైనా ఫోకస్ చేస్తున్నది. దీనికోసం జాతీయ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ను నియమించింది. అలాగే రాష్ట్రానికి సంబంధించి సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణను నియమించింది.
జనవరిలో జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
జాతీయ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పార్టీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ అన్ని రాష్ర్టాలను చుట్టేస్తున్నారు. సంస్థాగత ఎన్నికలపై నిర్వహించే సమావేశాల్లో పాల్గొని దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో యెండల లక్ష్మీనారాయణ నిమగ్నమయ్యారు. ఇటీవలే ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 16 నుంచి 30 వరకు బూత్ కమిటీలను పూర్తిచేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బూత్ కమిటీలు పూర్తయిన తరువాత ఢిల్లీలో అన్ని రాష్ర్టాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో అధిష్టానం సమావేశం కానుంది. ఈ సమావేశంలో మండల, జిల్లా, రాష్ర్ట కమిటీలపై మార్దనిర్దేశం చేయనున్నట్లు సమాచారం. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 21న జాతీయ, 27న రాష్ట్ర, డిసెంబర్ 20న జిల్లాస్థాయిలో కార్యశాలలను నిర్వహించనున్నారు. మండల, జిల్లా కమిటీల నిర్మాణం పూర్తయ్యాక రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభంకానుంది. డిసెంబర్ చివరికల్లా అన్ని రాష్ట్రాల అధ్యక్షుల నియామకం పూర్తవుతుందని సమాచారం. ఆ తరువాత జనవరిలో జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.