తెలంగాణ 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్.. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాలు విడుదల

by Vinod kumar |
తెలంగాణ 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్.. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాలు విడుదల
X

దిశ, కెరీర్: తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేయాలన్న లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. ఈ నెల 11న టెన్త్ ఎగ్జామ్స్ ముగిసిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు స్పాట్ వాల్యుయేషన్ పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో స్పాట్ వాల్యుయేషన్ ను ప్రారంభించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 సెంటర్లను ఏర్పాటు చేశారు.

ఈ సెంటర్లలో ఈ నెల 21వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ కొనసాగనుంది. అనంతరం టేబులేషన్ ప్రక్రియ మరో వారం, పది రోజుల పాటు కొనసాగనుంది. అనంతరం టేబులేషన్ ప్రక్రియ మరో వారం, పది రోజుల పాటు కొనసాగనుంది. ఆ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఫలితాలను విడుదల చేయనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే మూడో వారంలోగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story