- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్ సైబర్ టవర్స్ ఎదుట టీడీపీ చీఫ్ జన్మదిన వేడుకలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు బాబు పుట్టిన రోజులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఐటీ సెంటర్ అయిన హైటెక్ సిటీ సైబర్ టవర్ వద్ద చంద్రబాబు అభిమానులు, ఐటీ ఉద్యోగులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ‘బాబు సీఎం’ అంటూ నినాదాలు చేశారు. హైటెక్ సిటీ ఐటీ సెంటర్‌గా మారడానికి సీబీఎన్ కారణమని పలువురు ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు.
తమ జీవితాలని మార్చేసిన దార్శనికుడు చంద్రబాబు అని ఐటీ ఉద్యోగులు ఈ సందర్భంగా సీబీఎన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘బాబు సీఎం కావాలంటే మీరు ఏపీకి పోయి ఓట్లు వెయ్యాలి.. ఇక్కడ గొంతు చించుకొని అరిస్తే నడవదు’ అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఖమ్మం నగరంలో టీడీపీ జిల్లా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించాయి. దాదాపు 73 కేజీల భారీ కేక్ కట్ చేసి తెలుగు తమ్ముళ్లు వేడుకలు జరుపుకున్నారు.