KCRపై తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు..

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-03 09:34:42.0  )
KCRపై తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లు ఉన్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ ఛార్జీ తరణ్ చుగ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై మరింత విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సౌత్ లిక్కర్ మాఫియా దేశాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. ఢిల్లీ, పంజాబ్ మద్యం పాలసీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. కాగా సీబీఐ లిక్కర్ స్కాంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. 6న సీబీఐకి వివరణ ఇస్తానని కవిత తెలిపారు.

Also Read.

'ధరణిపై ప్రతిపక్షాలది రాద్ధాంతమే'

Advertisement

Next Story

Most Viewed