Tarakaratna: ఎఫ్‌ఎన్ ‌సీసీలో తారకరత్న పెద్దకర్మ.. నివాళులర్పించిన చంద్రబాబు

by srinivas |   ( Updated:2023-03-02 10:10:41.0  )
Tarakaratna: ఎఫ్‌ఎన్ ‌సీసీలో  తారకరత్న పెద్దకర్మ.. నివాళులర్పించిన చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో:హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో తారకరత్న పెద్దకర్మ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తారకరత్న తండ్రి మోహన్ కృష్ణను పరామర్శించి ఓదార్చారు. అనంతరం తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డితో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం తారకరత్న పెద్ద కుమార్తెతో చంద్రబాబు ముచ్చటించారు.


కాగా ఈ పెద్ద కర్మ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ అన్నీ తానై వ్యవహరించారు. ఇకపోతే ఫిబ్రవరి 18న నటుడు తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే. అయితే తారకరత్న పెద్దకర్మకు సంబంధించి ఆహ్వానపత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్దకర్మ తేదీ, స్థలంతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా బాలకృష్ణ, విజయసాయిరెడ్డి పేర్లని పొందుపరిచారు. అలాగే అలేఖ్యా రెడ్డి ఆమె పుట్టింటి తరఫు వాళ్ల పేర్లు మాత్రమే ఆహ్వానపత్రిలో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed