తాండూరు SIపై సస్పెన్షన్ వేటు.. కారణమిదే..!

by Disha Web Desk 4 |
తాండూరు SIపై సస్పెన్షన్ వేటు.. కారణమిదే..!
X

దిశ, ఆదిలాబాద్ బ్యూరో : పీడీఎస్ రైస్ అక్రమ దందా కేసు వ్యవహారంలో దర్యాప్తు విషయంలో ఆలసత్వంతో వ్యవహారించినందుకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని తాండూరు పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ కె. జగదీష్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఎవి రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేసారు.

ఎన్నికల నిర్వహణతో పాటు, నేర సమీక్షకు రామగుండం కమిషనరేట్ కార్యాలయానికి వచ్చిన మల్టీ జోన్ 1 ఐజీ పీడీఎస్ రైస్ కేసులపై సమీక్ష నిర్వహించారు. గత నెల 20న తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన పీడీఎస్ బియ్యం అక్రమ దందా కేసుపై సమీక్ష జరిపారు. ఈ కేసులో తాండూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ జగదీష్ అలసత్వంతో వ్యవహరించడంతో పాటు, పలు ఆరోపణలు రావడంతో ఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఐజీ వెల్లడించారు.

Next Story

Most Viewed