CM KCRకు లేఖ రాసిన తమ్మినేని.. డిమాండ్ ఇదే!

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-19 14:58:03.0  )
CM KCRకు లేఖ రాసిన తమ్మినేని.. డిమాండ్ ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంట్రాక్ట్‌ ఎఎన్‌ఎం లను రెగ్యులర్‌‌, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 02/2023 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం 1520 ఎంపీహెచ్‌ఎ(ఎఫ్‌) పోస్టులను రాతపరీక్ష ద్వారా భర్తీచేస్తున్నట్లు నోటిఫికేషన్‌ను ద్వారా తెలిపిందన్నారు. దీంతో 20ఏళ్ళుగా పనిచేస్తున్న 49 సంవత్సరాలు నిండి కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న సుమారు 6వేల మందిలో మెజారిటీ ఉద్యోగులు నష్టపోతున్నారని తెలిపారు.

వీరంతా డీఎస్‌సీ ద్వారా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌, మెరిట్‌ ప్రకారం ఎంపికై సేవలందిస్తున్నారని తెలిపారు. మళ్ళీ వీరికి పరీక్ష నిర్వహించడం సరైందికాదని తెలిపారు. వీరిని యథాతధంగా రెగ్యులర్‌ చేయాలని విజ్ఞప్తి చేసారు. సర్వీసును రెగ్యులర్‌ చేయాలని 2023 ఆగస్టు 15 నుండి సుమారు 6వేల మంది సమ్మె చేస్తున్నారని తెలిపారు. వైద్య రంగంలో కేంద్ర, రాష్ట్ర స్కీమ్‌లను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళడంలో, శిశు మరణాలను తగ్గించడంలో, కేసీఆర్‌ కిట్‌, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడంలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు.

ఇమ్యూనైజేషన్‌, ఫ్యామిలీ ప్లానింగ్‌ వంటి పనుల్లో ఎంతో కృషి ఉన్నందున వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే కాంట్రాక్ట్‌ మెడికల్‌ ఆఫీసర్లను మెరిట్‌ ఆధారంగా సర్వీసుకు వెయిటేజి ఇచ్చి రెగ్యులర్‌ చేశారని గుర్తుచేశారు. అలాగే జీఓ నెం.16 ప్రకారం కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్‌ ఎంపిహెచ్‌ఎ (ఫిమేల్‌), ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, ఫార్మసిస్ట్‌, మేల్‌ హెల్త్‌ అసిస్టెంట్లను రెగ్యులర్‌ చేశారని తెలిపారు. వివిధ శాఖల్లో కూడా సుమారు ఐదు వేలకు పైగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేశారని సీఎం దృష్టికి తెచ్చారు. 02/2023 నోటిఫికేషన్‌ను రద్దు చేసి, గత ఇరవై యేళ్ళుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ ఎంపిహెచ్‌ఎ (ఫిమేల్‌)లను రెగ్యులర్‌ చేయాలని అయన తన వినతిపత్రంలో కోరారు.

Advertisement

Next Story

Most Viewed