బీజేపీ స్టేట్ ఆఫీస్‌కి తమిళిసై.. ఎన్నికల ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ!

by Ramesh N |   ( Updated:2024-04-29 08:31:27.0  )
బీజేపీ స్టేట్ ఆఫీస్‌కి తమిళిసై.. ఎన్నికల ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మెజార్టీ గెలుపే లక్ష్యంగా బీజేపీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేతలను ప్రచారంలోకి దింపుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను రంగంలోకి దించారు. ఈ మేరకు ఆమె ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్‌కు వచ్చారు. తమిళనాడుకు చెందిన బీజేపీ వాలంటీర్లతో కలిసి ఆమె వచ్చారు. కాగా, రాష్ట్రంలో తమిళిసై 10 రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

తెలంగాణ గవర్నర్ పదివికి రాజీనామా చేసిన తమిళిసై లోక్‌సభ ఎన్నికల వేళ మళ్లీ పాలిటిక్స్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళనాడులోని చెన్నై సౌత్ పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు. తమిళనాడులో ఎన్నికలు ముగియడంతో.. తెలంగాణలో గవర్నర్‌గా పనిచేయడం.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో విభేదాలు ఉన్నాయనే అరోపణలు.. దీంతో ప్రచారంలో ఆమె ప్రసంగం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed