హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌పై చర్యలు తీసుకోండి: బల్మూరి వెంకట్

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-08 09:46:05.0  )
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌పై చర్యలు తీసుకోండి: బల్మూరి వెంకట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌పై హైకోర్టులో కంటెప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ దాఖలైంది. సీవీ ఆనంద్‌తో పాటు సైఫాబాద్ పోలీసులపై ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాడు. అసెంబ్లీ ముట్టడిలో భాగంగా పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చేశారని, 41ఏ నోటీస్ ఇవ్వకుండానే పోలీసులు అరెస్టు చేశారంటూ పిటిషన్‌లో పేర్కొన్నాడు. అరెస్టుకు మందు నోటీసులు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తన విషయంలో పోలీసులు పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను అక్రమంగా అరెస్టు చేసిన హైదరాబాద్ సీపీ ఆనంద్‌తో పాటు నలుగురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed