స్వప్న‌లోక్ అగ్ని ప్రమాదం : ఆరుగురు మృతి.. తప్పిన భారీ ప్రాణ నష్టం

by Hamsa |
స్వప్న‌లోక్ అగ్ని ప్రమాదం : ఆరుగురు మృతి..  తప్పిన భారీ ప్రాణ నష్టం
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డెక్కన్ మాల్ విషాదం మర్చిపోక ముందే స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది. స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో మొత్తం ఆరుగురు మృతి చెందారు. మృతులను శివ, ప్రశాంత్, శ్రావణి, ప్రమీల, వెన్నెల, త్రివేణి ఉన్నారు. మృతుల్లో ఐదుగురిది ఉమ్మడి వరంగల్ జిల్లా కాగా ఒకరిది ఖమ్మంగా గుర్తించారు.

మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించగా బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతులంగా ఓ ఈ కామర్స్ కంపెనీలో కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మంటలు స్వప్న లోక్ కాంప్లెక్స్‌లో వ్యాపించడంతో వీరంతా ఓ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. దీంతో ఊపిరాడక స్పృహ తప్పి పడి ఉండటాన్ని గమనించిన ఫైర్ ఫైటర్స్ హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వీరు చనిపోయినట్లు ధృవీకరించారు.

కాగా శ్రావణ్, భారతమ్మ, సుధీర్ రెడ్డి, పవన్, దయాకర్, గంగయ్య, రవిలను అగ్నిమాపక సిబ్బంది రక్షించి సమీప హాస్పిటల్ కి తరలించారు. వీరు కూడా 4 గంటల పాటు పొగలో చిక్కుకుని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బాధితులను కాపాడే క్రమంలో తుకారాం గేటు కానిస్టేబుల్ ఎం. రవి పొగతో అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ కాంప్లెక్స్ లో మొత్తం 3 వేల మంది వరకు సిబ్బంది పనిచేస్తుంటారు. మొత్తం 170 షాపులున్నాయి. మంటలు అంటుకునే సమయానికి 5 నుంచి 7 అంతస్తుల్లో చాలా కార్యాలయాల నుంచి సిబ్బంది వెళ్లిపోవడంతో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం తప్పింది.

Advertisement

Next Story