లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సర్వేయర్..

by Kalyani |
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సర్వేయర్..
X

దిశ, ఏటూరు నాగారం: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏటూరు నాగారం మండల రెవెన్యూ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ సర్వేయర్ గా పనిచేస్తున్న బొచ్చు మహేందర్, ఎర్రబెల్లి మనోహర్ రావు అనే రైతు వద్ద రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎర్రబెల్లి మనోహర్ రావు అనే రైతు తన కూతురుకు ఐదున్నర ఎకరాల భూమిని ఇవ్వడం కొరకు భూమి సర్వే చేయమని సర్వేయర్ బొచ్చు మహేందర్ ను సంప్రదించాడు.

ఈ క్రమంలో రైతు మనోహర్ రావును రూ. 10 వేలు లంచం ఇవ్వమని సర్వేయర్ మహేందర్ డిమాండ్ చేశాడు. దీంతో మనోహర్ రావు ఈ నెల 6 వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సోమవారం ఏసీబీ అధికారులు ఏటూరు నాగారం మండలంలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం ఎదుట మనోహర్ రావు అనే రైతు వద్ద లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed