Supreme Court: పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టులో విచారణ.. ధర్మాసనం సీరియస్

by Shiva |   ( Updated:2025-01-31 07:47:43.0  )
Supreme Court: పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టులో విచారణ.. ధర్మాసనం సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ (BRS Party) ఈ నెల 16న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో రెండు పిటిషన్లను దాఖలు చేసింది. ఈ మేరకు ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలంటూ తెలంగాణ (Telangana) అసెంబ్లీ సెక్రటరీ (Assembly Secretary)పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అందుకు ప్రభుత్వం తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi) తగిన సమయం ఇవ్వాలంటూ కోర్టు అభ్యర్థించారు. అందుకు ధర్మాసనం మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? అంటూ ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ (Reasonable Time) అంటే మహారాష్ట్ర (Maharashtra) తరహాలో శాసనసభ గడువు ముగిసే దాకా.. అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు ప్రభుత్వం తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi) స్పందిస్తూ.. శాసనసభ స్పీకర్‌ (Legislative Assembly Speaker)ను అడిగి నిర్ణయాన్ని కోర్టుకు విన్నవిస్తామని బదులిచ్చారు. దీంతో తదుపరి విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

కాగా, బీఆర్‌ఎస్‌ పార్టీ (BRS Party) గుర్తుపై గెలిచిన తెల్లం వెంకట్ రావు (Tellam Venkat Rao), దానం నాగేందర్ (Danam Nagender), కడియం శ్రీహరి (Kadiyam Srihari)‌తో సహా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ (Congress Party)లోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అయితే.. పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా స్పీకర్ (Speaker) నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్‌ఎస్‌ (BRS) ఎమ్మెల్యేలు ఎస్ఎల్‌పీ (SLP) దాఖలు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్‌ ఇప్పటి దాకా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని, ఫిరాయింపుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇటీవలే హరీశ్ రావు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Next Story