Supreme Court: ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు.. తీర్పు సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-08-27 15:43:48.0  )
Supreme Court: ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు.. తీర్పు సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ మేరకు ఆమె పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌ ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, గంటన్నర పాటు వాదనలు విన్న బెంచ్ తీర్పు సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా ఈడీ అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని ఆక్షేపించింది. కేసులో విచారణ పూర్తయి.. చార్జ్‌షీట్ కూడా దాఖలైనా కవితను ఈ దశలో ఇంకా జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. సెక్షన్-45 ప్రకారం.. బెయిల్ పొదేందుకు ఒక మహిళకు అర్హత ఉందని వ్యాఖ్యానించింది. ఒకవేళ బెయిల్ తిరస్కరించాలంటే అందుకు సహేతుక కారణం చెప్పాలని పేర్కొంది. హైకోర్టు సింగ్ బెంచ్ కూడా సహేతుక కారణం చూపలేదని సీరియస్ అయింది.

Advertisement

Next Story

Most Viewed