రాష్ట్రపతి పర్యటనకు పటిష్టమైన బందోబస్తు: SP Vineet Ji

by Kalyani |   ( Updated:2022-12-26 14:19:58.0  )
రాష్ట్రపతి పర్యటనకు పటిష్టమైన బందోబస్తు: SP Vineet Ji
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: ఈ నెల 28వ తేదీన భారత రాష్ట్రపతి భద్రాచలం పర్యటనలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డా. వినీత్ జీ ఒక ప్రకటనలో వెల్లడించారు. సుమారుగా 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు ఎస్పీ తెలిపారు. తమకు కేటాయించిన ప్రదేశాలలో పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటారని తెలియజేశారు. రాష్ట్రపతి పర్యటనలో భాగంగా ఈ నెల 28వ తేదీన ఉదయం 7.30 గంటల నుంచి భద్రాచలం పట్టణ పరిసర ప్రాంతాలలో వాహన రాకపోకలకు ఆంక్షలు విధించడం జరుగుతుందని చెప్పారు. ఆయా చోట్ల వాహన తనిఖీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అవసరమైన చోట ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉంటాయని తెలిపారు. పోలీసు వారికి సహకరించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఏదైనా అత్యవసరమైతే నిరంతరం పోలీసులు అందుబాటులో ఉంటారని, డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసువారి సేవలను పొందవచ్చని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed