స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాకు స్టేట్ లెవెల్ కమిటీ భేటీ

by M.Rajitha |
స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాకు స్టేట్ లెవెల్ కమిటీ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : పాఠశాల స్థాయి నుండి ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా క్రీడా పాలసీని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తుంది. స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాకు బుధవారం స్టేట్ లెవెల్ కమిటీ సమావేశం టూరిజం ప్లాజాలో నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చే ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేసి, ప్రోత్సహించుటకు పటిష్టమైన కార్యచరణ రూపొందించనున్నారు. గతంతో పోల్చితే క్రీడలకు ఈ ఏడాది 10 రెట్లు అధికంగా నిధులను ప్రభుత్వం కేటాయించింది. క్రీడా క్యాలెండరు అమలుకు అవసరమైన వసతులతో పాటు నిర్వహణకు స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి, రాష్ట్ర క్రీడా అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి, వేణుగోపాల చారి, రాష్ట్ర యువజన సర్వీసు లు, సాంస్కృతిక, క్రీడా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ మరియు ఎండీ సోనీ బాలాదేవి, జగదీశ్వర్ యాదవ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్, ఇస్మాయిల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed