- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ambati Rayudu :మల్కాజిగిరి బరిలో స్టార్ క్రికెటర్..
దిశ ప్రతినిధి, మేడ్చల్ : దేశంలోనే అతిపెద్దదైన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం మరోసారి వార్తల్లోకెక్కనుంది. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈ నియోజకవర్గంలో ఉద్దండులు పోటీకి సై అంటారు. ప్రధాన రాజకీయ పార్టీలు కీలక నేతలను లేదంటే ప్రముఖ వ్యక్తులను పోటీ చేయిస్తుంటాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈసారి కూడా హేమహేమీలను రంగంలోకి దింపాలని పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడును మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చేబుతున్నాయి.
రాజకీయాలపై అసక్తి..
అంబటి రాయుడు ఎపీలోని గుంటూరు జిల్లా పొన్నూరులో 1985, సెప్టెంబర్ 23న సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు.మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని యప్రాల్ లో నివాసం ఉంటూ సైనిక్ పూరిలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో చదువుకున్నాడు.రాయుడు తన మూడవ క్లాసు (1992వ సంవత్సరం)లో హైదరాబాద్ మాజీ క్రికెటర్ విజయ్ పాల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. అతని క్రికెట్ కేరియర్ అండర్ 16 తో ప్రారంభమై భారత్ జట్టులో ప్రముఖుడిగా పేరొందాడు.క్లిష్ట సమయాల్లో బరిలోకి దిగి ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్ లలో భారత్ గెలుపునకు కారకడయ్యాడు.
అయితే రాయుడు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించకా, అతని చూపు రాజకీయాల వైపు మళ్లీంది. పొలిటీకల్ ఎంట్రీకి పరోక్షంగా సంకేతాలు ఇవ్వడంతో ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,తెలుగు దేశం పార్టీలు అంబటి రాయుడు తో సంప్రదింపులు జరిపాయి. గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయించేందుకు పావులు కదిపాయి. అయితే రాయుడు చిన్ననాటి నుంచి హైదరాబాద్ లోనే నివాసం ఉండడం.. విద్యాభ్యాసాన్ని అంతా మల్కాజిగిరిలోనే పూర్తి చేయడం.. యూత్ లో విపరీతమైన క్రేజీ ఉండడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంబటిని మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించేందుకు అతనితో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.
అజర్‌కు బాధ్యతలు..
అంబటి రాయుడును కాంగ్రెస్ పార్టీలోకి రప్పించే బాధ్యతను ప్రముఖ క్రికెటర్, పార్టీసీనియర్ నేత అజారుద్దీన్‌కు పార్టీ అధిష్టానం అప్పగించినట్లు సమచారం. ఏం చేస్తావో తెలియదు. అంబటిని మాత్రమ పార్టీలోకి తీసుకోచ్చే బాధ్యత మీదే అని అజార్‌ను హై కమాండ్ అదేశించినట్లు సమాచారం. కాగా భారత మాజీ కెప్టెన్‌గా, హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజార్‌కు అంబటితో సన్నిహిత సంబంధాలున్నాయి.
ఈ విషయమై అంబటి రాయుడుతో ఇప్పటికే అజారుద్దీన్ భేటీ అయినట్లు తెలిసింది. కాగా అంబటి రాయుడును మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా బరిలోకి దింపాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకుండా బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషిస్తోంది.
అందుకే అంబటిపై పోకస్...
మల్కాజిగిరి ఎంపీ కోసం అంబటి అయితే బాగుంటుందని పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. అంబటి రాయుడు ఏపీకి చెందిన వ్యక్తి, పైగా కాపు సామాజిక వర్గం. ఇక మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చిన సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. వీరిలో కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడి గెలుపోటములను ప్రభావితం చేయగలరు. అందుకే ఎపీ వ్యక్తి .. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అతడైనే గెలుపు సులభమవుతుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. అందుకే అంబటి రాయుడిని కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చి.. మల్కాజిగిరి నుంచి పోటీ చేయించాలని ప్రయత్నిస్తోంది.