Sridhar Babu: ఆ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాం.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2025-01-23 03:15:46.0  )
Sridhar Babu: ఆ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాం.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దావోస్‌ (Davos)లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో తెలంగాణ (Telangana) భారీ పెట్టుబడులను సమీకరించింది. బుధవారం ఒక్కరోజే మూడు కంపెనీతో రూ.56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూ (MOU)లు చేసుకున్నారు. వాటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యువతకు సుమారు 10,800 ఉద్యోగ అవకాశాలు లభించనున్నారు.

ఈ సందర్భంగా ఇవాళ దావోస్‌లో మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) మీడియాతో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత రెండో సారి దావోస్ (Davos) వచ్చామని, చాలా ప్రోత్సాహకరంగా సమ్మిట్ కొనసాగుతోందని అన్నారు. పారిశ్రామిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఎదుగుతోందని తెలిపారు. ఐటీ రంగంలో అగ్రగామిగా తెలంగాణ అవతరించబోతోందని అన్నారు. వ్యవసాయం, ఫిషరీస్, డెయిరీలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. గత సంవత్సరం వివిధ కంపెనీలతో చేసుకున్న ఎంవోయూలలో 80 శాతం ప్రొగ్రెస్ ఉందని తెలిపారు. గ్లోబల్ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Next Story