అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా పాఠశాలలు : స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి

by M.Rajitha |
అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా పాఠశాలలు : స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా రాష్ట్రక్రీడా శిక్షణ సంస్థల్ని తీర్చిదిద్దుతామని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అధికార బృందం గురువారం బళ్లారిలోని విజయనగర్ ఇన్స్పైర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్పోర్ట్స్ ను సందర్శించింది. క్రీడాకారులకు కల్పిస్తున్న వసతుల్ని పరిశీలించింది. శిక్షణలో అమలుపరుస్తున్న నూతన పద్ధతుల్ని క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పరిశీలించామన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ, భవిష్యత్తులో ప్రతి లోకసభ నియోజకవర్గానికి ఏర్పాటు చేయనున్న క్రీడా పాఠశాలల ఏర్పాటు నిమిత్తం వివిధ అంశాలను పర్యవేక్షించామన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న ఈ సంస్థ పనితీరును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించే అన్ని క్రీడా శిక్షణ సంస్థల పనితీరు మెరుగుపరచడానికి ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ఈ బృందంలో రాష్ట్ర ప్రభుత్వ యువజన అభివృద్ధి పర్యాటక క్రీడలు సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ సుధాకర్ రావు, రతన్ కుమార్, బోస్, రవి, సురేష్ ఉన్నారు.

Next Story

Most Viewed