రూ.2వేల నోటుపై స్పెషల్ ఆఫర్స్.. అవేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Sathputhe Rajesh |
రూ.2వేల నోటుపై స్పెషల్ ఆఫర్స్.. అవేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, అశ్వారావుపేట : ఇటీవల రద్దయిన రూ.2000 నోట్లను పెద్ద మొత్తంలో నిల్వ ఉంచుకొని వాటిని ఎలా మార్చుకోవాలనుకునే వారి ఆందోళనను సైతం క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. కొందరు సిసలైన వ్యాపారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో రద్దయిన రూ.2000 నోటును తీసుకుంటామని కొందరు వ్యాపారస్తులు సోషల్ మీడియా వేదికగా రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఓ సెల్ & ఎలక్ట్రానిక్స్ యజమానేమో గత బకాయిలను క్లియర్ చేసుకునేందుకు ₹2,000 నోటును ఇచ్చిన తీసుకుంటామని ప్రకటించారు.

మరో కన్స్‌ట్రక్షన్ రియల్టర్ రూ.2000 నోట్లు చెల్లించి ఇంటి స్థలం కానీ బిల్డింగ్ అయిన సొంతం చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. ఇలా రకరకాల ఆఫర్లతో రూ.2000 నోటు రద్దు పరిణామాన్ని కూడా తమకు అనువుగా మార్చుకునేందుకు వ్యాపారులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అయితే మరికొందరు ఓ అడుగు ముందుకేసి రూ.2000 రూపాయల నోట్లను మార్పిడి చేసి పెడతామని అందుకు 10% కమిషన్ ఖర్చవుతుందని చెబుతుండటం విశేషం. రద్దయిన రూ.2000 నోటుపై కొందరు సేల్స్ పెంచుకునేందుకు.. పాత బకాయిలను రాబట్టుకునేందుకు చూస్తుంటే.. అదే నోటుపై కమిషన్ కొట్టేయాలని మరి కొంత మంది స్కెచ్ వేస్తున్నారు.

Advertisement

Next Story