- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజన రిజర్వేషన్లపై సోయం బాపురావు కామెంట్స్.. కిషన్ రెడ్డి క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో : లంబాడీ సామాజిక వర్గం రిజర్వేషన్ల పై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు సంజీవ రావు, శ్రీదేవి కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కిషన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ. గిరిజన రిజర్వేషన్ల అంశంపై ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కిషన్ రెడ్డి తెలిపారు.
లంబాడీలకు అన్ని రకాలుగా బీజేపీ అండగా ఉంటుందన్నారు. జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్లను పెంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన వెల్లడించారు. గిరిజన రిజర్వేషన్లను మత రిజర్వేషన్లతో ముడి పెడుతూ.. బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని, ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఎత్తేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇండ్ల పేరుతో నిరుపేదలకు కేసీఆర్ వెన్నుపోటు పొడిచాడని ధ్వజమెత్తారు.
దీనికి నిరసనగా మహబూబ్ నగర్ లో సోమవారం నిరసన చేపడుతున్నట్లు చెప్పారు. ఇద్దరు దళిత మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నేతలు పార్టీలో చేరడంతో ఉత్తర తెలంగాణలో పార్టీకి మరింత బలం చేకూరినట్లయిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒకే గూటి పక్షులని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని, కలిసి పని చేశాయన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతిచ్చిన విషయాన్ని ఎవరూ మరిచిపోలేదని గుర్తుచేశారు.
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంలో ఈ మూడు పార్టీలు కలిసి వెళ్లాయని అన్నారు. దీన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. ఈ మూడు పార్టీలు కుటుంబాల కోసం పని చేసే పార్టీలేనని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి, నియంత, కుటుంబ పార్టీలుగా పేర్కొన్నారు. దేశం, రాష్ట్రం, ప్రజల కంటే వీరికి కుటుంబంమే ముఖ్యమని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకొని హామీలను గాలికి వదిలేసిందని ఆయన ధ్వజమెత్తారు.
కుటుంబ పెత్తనం పోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పై నిరంతర పోరాటం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. అతి వర్షాలతో వరదలు వచ్చినా బాధితులకు ప్రభుత్వం ఎటువంటి సహాయం ప్రకటించలేదని ఫైరయ్యారు. కేంద్రం ప్రకటించినా రాష్ట్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వరద ముంపు గ్రామాల్లో కేంద్ర బృందాలు పర్యటించి వరద సాయంపై నివేదిక తయారు చేసి కేంద్రానికి అందించనున్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
టచ్‌లో మరో పదిమంది
ఏలేటీ మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన ఇద్దరు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని, ఇది సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో 10కి 10 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. మరో పది మంది ముఖ్య నేతలు తనకు టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. వారం రోజుల్లో వారంతా బీజేపీలో చేరుతారని ఏలేటి స్పష్టం చేశారు.
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనను దింపేందుకు అందరూ కలిసి వస్తున్నారని తెలిపారు.