- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్
by GSrikanth |

X
దిశ, డైనమిక్ బ్యూరో: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సాంకేతిక కారణాలతో రేపటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు 4 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. కాచిగూడ-నిజామాబాద్ (07596), నిజామాబాద్-కాచిగూడ (07593), నాందేడ్-నిజామాబాద్ (07854), నిజామాబాద్-నాందేడ్ (07853) రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా డౌండ్-నిజామాబాద్, ముద్ఖేడ్-నిజామాబాద్ (11409) రైలును రేపటి నుండి 13వ తేదీ వరకు రద్దు చేస్తుండగా...నిజామాబాద్-పంధర్పూర్, నిజామాబాద్-ముద్ఖేడ్ (01413) రైలును గురువారం(ఈనెల 8 వ తేదీ) నుండి 14 వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రయాణికులు రద్దైన రైలు వివరాలను గమనించాలని సూచించింది.
Next Story