Sonu Sood: తెలుగు ప్రజలే నా కుటుంబ సభ్యులు.. పాలమాకులలో విద్యార్థులతో సోనూసూద్ సందడి

by Ramesh N |   ( Updated:2024-11-29 06:56:39.0  )
Sonu Sood: తెలుగు ప్రజలే నా కుటుంబ సభ్యులు.. పాలమాకులలో విద్యార్థులతో సోనూసూద్ సందడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కస్తూర్బా గాంధీ గురుకుల విద్యార్థులతో కలిసి ప్రముఖ నటుడు సోనూసూద్ సందడి చేశారు. తాజాగా ఆయన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను సోనూసూద్ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అలరించారు. వారితో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా సోనూసూద్ మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు సిద్ధూ రెడ్డి పేద ప్రజల కోసం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం చాలా గర్వంగా ఉందని చెప్పారు.

సిద్ధూ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని పాఠశాలల అభివృద్ధి కోసం సొసైటీలోని వ్యక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తను పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని, కాకపోతే తెలుగు ప్రజలు నా కుటుంబ సభ్యులు అని కొనియాడారు. పాలమాకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని సోనూసూద్ తెలిపారు.

Advertisement

Next Story