సోనియా బర్త్ డే స్పెషల్.. సీఎంగా ఎన్నికయ్యాక తొలిసారి గాంధీభవన్‌కు రేవంత్

by GSrikanth |
సోనియా బర్త్ డే స్పెషల్.. సీఎంగా ఎన్నికయ్యాక తొలిసారి గాంధీభవన్‌కు రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ(డిసెంబర్ 9th) తన 77వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు, సోనియా అభిమానులు ఆమె జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో మరింత గ్రాండ్‌గా సోనియా బర్త్ డే వేడుకలు నిర్వహించడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి సోనియాకు అడ్వాన్స్‌గా బర్త్‌ డే గిఫ్ట్‌ ఇచ్చారు.

కాగా, దీంతో ఇవాళ గాంధీ భవన్‌లో భారీ ఎత్తున సెలబ్రేషన్స్‌ చేయనున్నారు. ఈ వేడుకల కోసం ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. సీఎం రేవంత్‌తో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. అంతేకాదు.. ఇవాళే సోనియా బర్త్‌ డే సందర్భంగా ప్రభుత్వం రెండు గ్యారంటీలను అమల్లో పెట్టనుంది. సీఎంగా ఎన్నికయ్యాక తొలిసారి రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌కు వస్తుండటంతో ఏర్పాట్లు మరింత అట్టహాసంగా చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed