తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే, కేసీఆర్ మోసం చేశారు: దొరై

by Mahesh |
తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే, కేసీఆర్ మోసం చేశారు: దొరై
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇస్తే, కేసీఆర్ ఇక్కడి ప్రజలను మోసం చేశాడని రాజీవ్ అమర జ్యోతి ఆర్గనైజర్ దొరై విమర్శించారు. బుధవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ..పదేళ్ల పాటు దోపిడీకి గురైన తెలంగాణను సీఎం రేవంత్ నాయకత్వంలో చక్కదిద్దు తున్నారన్నారు. ప్రజల కోరిక, ఆకాంక్షల మేరకు పాలన సాగుతోందని అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలలో పేదలకే పెద్దపీట అన్నారు. భవిష్యత్ లో దేశంలోనూ అధికారంలోకి రాబోతున్నామని వెల్లడించారు. ఇక రాజీవ్ గాంధీ పెరంబుదూరు లో బాంబు దాడిలో మరణించినా, ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అందరి హృదయాల్లో నిలిచి పోయారన్నారు. ఆయన జ్ఞాపకార్ధం కోసమే అమర జ్యోతి యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ లో అడుగు పెట్టిన యాత్రకు అపూర్వ స్వాగతం పలికారన్నారు.ఈ నెల 20 న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే కు జ్యోతిని అందజేస్తామని వెల్లడించారు.

Advertisement

Next Story