- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ.. ఆ ట్వీట్ తో సోషల్ మీడియాలో ముదురుతున్న వార్
దిశ, డైనమిక్ బ్యూరో:తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయినా పోలిటికల్ వేడి తగ్గడం లేదు. ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ పొలిటికల్ రచ్చగా మారుతోంది. ఇరు పార్టీలకు చెందిన మద్దతుదారులు కామెంట్లకు పదును పెడుతుండటంతో ఈ వ్యవహారం మరింత దుమారంగా మారుతోంది. ఏపీలో విజయంతో దూకుడుగా ఉన్న టీడీపీ తెలంగాణపై దృష్టి సారించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటువంటి తరుణంలో టీడీపీ మద్దతు దారులు చేస్తున్న సోషల్ మీడియా పోస్టులపై బీఆర్ఎస్ మద్దతు దారులు రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ఇరుపార్టీల సపోర్టర్స్ మధ్య కామెంట్స్ బూతు పూరాణాల వరకు చేరడంతో రాజకీయం విమర్శలు కాస్త జుగుప్సకరంగా మారుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీల మధ్య సోషల్ మీడియాలో వార్ ముదరడం వెనుక భవిష్యత్ పొలిటికల్ సిట్యూయేషన్ కు ఇండికేషన్ ఏదైనా ఉందా అనే చర్చ పొలిటికల్ కారిడార్ లో వినిపిస్తోంది.
ఆపరేషన్ తెలంగాణ.. ఆ ట్వీట్ తో రచ్చ:
ఇటీవల కేంద్ర కేబినెట్ కూర్పు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ మద్దతుదారురాలు ఒకరు చేసిన ట్వీట్ పై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇరు పార్టీలమధ్య డైలాగ్ వార్ కు ఆజ్యం పండింది. ‘కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. ఈ ఆపరేషన్ లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను బీజేపీలోకి తీసుకుని రావాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉందని మోడీ దిశా నిర్దేశం చేశారు. కూతురు లిక్కర్ స్కామ్ లో కుమారుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో అల్లుడు మెడిగడ్డా బ్యారేజీ అక్రమాల్లో చిక్కుకున్నారని ఈ విషయం ప్రజలు గుర్తించారని ప్రధాని మంత్రులకు చెప్పారు. అని ఆమె ట్వీట్ లో రాసుకొచ్చారు. దీనికి బీఆర్ఎస్ కు చెందిన ఓ సపోర్టర్ కౌంటర్ ఇస్తూ చంద్రబాబు సింహం కాదు.. గ్రామ సింహం అని, గతంలో కేసీఆర్ హెచ్చరిస్తే తెల్లారేసరికి కరకట్టకు వెళ్లిపోయారని కౌంటర్ ఇచ్చారు. మాతో ఎందుకురా.. బట్టలిప్పి కొడతాం మీ కర్రీ పాయింట్ బ్యాచ్ ని అంటూ పోస్ట్ చేశాడు. దీనిపై టీడీపీ మద్దతు దారుల నుంచి ఘాటు కామెంట్స్ వచ్చాయి. దీంతో ఇటు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ పొలిటికల్ జయాపజయాలను కోడ్ చేస్తూ ఇరు వైపుల నుంచి విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్ధానికి దిగి పొలిటికల్ టెంపోను పెంచుతున్నారు.
ఏపీ రిజల్ట్స్ తో బీఆర్ఎస్ లో ప్రకంపణలు తప్పవా?:
ఇక ఏపీలో వెలువడిన ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాశంగా మారాయి. అక్కడ కూటమి గెలుపొందడంతో బీఆర్ఎస్ లో త్వరలోనే ప్రకంపణలు తప్పవు అనే చర్చ సోషల్ మీడియాలో గుప్పుమంటోంది. ముఖ్యంగా ఏపీలో మరోసారి జగనే గెలుస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంచనా వేశారు. కానీ ఫలితాలు మాత్రం చంద్రబాబుకు అనుకూలంగా మారాయి. దీంతో ఇన్నాళ్లు తెలంగాణలో యాక్టివ్ గా లేని పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు చంద్రబాబు దృష్టి సారించబోతున్నారని ఇందులో భాగంగా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అదే ప్రయత్నంలో ఉన్నారనే టాక్ సామాజిక మాధ్యమాల్లో గుప్పుమంటోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల్లో అనేక మంది రాజకీయం టీడీపీ పార్టీతో ముడిపడి ఉంది. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న పరిస్థితి దృష్ట్యా వారిలో కొంత మంది అక్కడ జెండా ఎత్తేయడం ఖాయం అనే చర్చ జరుగుతంది. అందులో భాగంగానే టీడీపీ సోషల్ మీడియా విమర్శలను బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంటోందా? అనే చర్చ తెరమీదకు వస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయనేది వేచి చూడాలి.