‘పుష్పరాజ్‌’ను మించిన స్మగ్లింగ్.. కారు డిక్కీ కింద చూసిన పోలీసులు షాక్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-04 08:06:20.0  )
‘పుష్పరాజ్‌’ను మించిన స్మగ్లింగ్.. కారు డిక్కీ కింద చూసిన పోలీసులు షాక్!
X

దిశ , కోదాడ టౌన్ : పుష్ప రేంజ్ లో స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన ముఠా పోలీసులకు చిక్కింది. కారు డిక్కీ కింద ఓ ఐరన్ బాక్స్ ఫిక్స్ చేసి అందులో నిందితులు తెలివిగా గంజాయి తరలిస్తున్నారు. సూర్యాపేట ఎస్పీ ఎస్. రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. సులువుగా డబ్బు సంపాదనకు అలవాటుపడ్డ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సల్మాన్ , అరుణ్ లు ఇద్దరు ఆంధ్రప్రదేశ్, రాజమండ్రికి చెందిన చిరంజీవితో గంజాయిని తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సోమవారం మధ్యాహ్నం రాజమండ్రి నుండి నూటా పదమూడు కేజీల గంజాయిని (63 ప్యాకెట్లు) AP21AU2947 నెంబరు గల ఇండికా కారు వెనుకభాగంలో సీటు స్థానంలో ఒక ఐరన్ బాక్స్ ను ఏర్పాటు చేశారు.

డిక్కీలో మాత్రం గ్యాస్ కిట్‌ను అలాగే ఉంచి డిక్కీ కింది భాగంలో మరొక ఐరన్ బాక్స్ ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా రెండు బాక్సులలో సినీ ఫక్కీలో రాజమండ్రి నుండి గంజాయిని ముంబాయి, మహారాష్ట్రకు తరలించేందుకు పన్నెండువేలకు బేరం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.6వేలు తీసుకొని వెళుతున్న క్రమంలో కోదాడ రూరల్ పరిధిలోని రామాపురం ఎక్స్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసిన నిందితులు ఇద్దరు కారు వదిలి పారిపోతుండగా పోలీసులు గంజాయితో ఉన్న కారును మరియు నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు సూర్యాపేట ఎస్పి ఎస్.రాజేంద్ర ప్రసాద్ విలేకరులకు తెలియజేసారు. మరో నిందితుడు చిరంజీవి పరారీలో ఉన్నాడు . ఈ సందర్భంగా ఎస్పీ రాజేంద్రప్రసాద్ - కోదాడ డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కేసును చేదించిన కోదాడ రూరల్ సీఐ పి.ఎస్.డి ప్రసాద్ , కోదాడ రూరల్ ఎస్సై సాయి ప్రశాంత్ , చిలుకూరు ఎస్సై శ్రీనివాస్ , హెడ్ కానిస్టేబుల్ సమ్మద్ , హమీద్ , కానిస్టేబుళ్ళు నిరంజన్ , ఉపేందర్ , శ్రీకాంత్ , సుధాకర్ , మేళ్ళచెరువు పిఎస్ లను అభినందించారు .

Advertisement

Next Story

Most Viewed