- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేషన్‌లో ‘స్మార్ట్’ మోసం.. రూ.27లక్షల స్వాహాకు స్కెచ్!
దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకు తిన్న చందంగా ఉంది కొంతమంది అధికారుల తీరు. కొంతమంది అక్రమార్కులు పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నయా మోసానికి తెరలేపారు. కొత్త రేషన్ కార్డులంటూ మోసం చేస్తూ అక్రమ దందాకు తెరతీశారు. అలా ఒకటీ కాదు రెండు కాదు ఏకంగా 13వేల మంది పైగా మోసం చేసి రూ.లక్షలు దండుకున్నారు. ఒక మండలంలో ఇంత జరుగుతున్నా సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. గుర్రంపోడు మండలంలో తాజాగా వెలుగుచూసిన ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
నల్లగొండ జిల్లాలోని గుర్రంపోడు మండలంలో 13,742 రేషన్ కార్డుదారుల కుటుంబాలు ఉన్నాయి. అయితే మండలంలోని పలువురు డీలర్లు, అక్రమార్కులు ఏకమై రేషన్ కార్డు స్థానంలో స్మార్ట్ కార్డు వచ్చిందని నమ్మబలికారు. సదరు నకిలీ కార్డును తీసుకోకపోతే సంక్షేమ పథకాలన్నీ కట్ అవుతాయంటూ పుకార్లు పుట్టించారు. దీంతో పేదలు స్మార్ట్ కార్డుల కోసం ఎగబడి మరీ తీసుకున్నారు. అయితే ఒక్కో కార్డుకు రూ.200 చొప్పున కొంతమంది డీలర్ల ద్వారా కార్డులు జారీ చేశారు. ఇలా మండలంలో సుమారు రూ.27లక్షలు వసూలు చేసేందుకు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
దిశ, నల్లగొండ బ్యూరో
దిశ, నల్లగొండ బ్యూరో : ‘దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకు తిన్నట్టు’ అన్న చందంగా కొంతమంది అధికారుల తీరు తయారైంది. పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నయా రేషన్ కార్డులంటూ మోసం చేస్తూ కొత్త దందాకు తెరలేపారు. అలా ఒకటీ కాదు రెండు కాదు ఏకంగా 13వేల మందికి పైగా మోసం చేసి రూ.లక్షలు దండుకున్నారు. ఒక మండలంలో ఇంత జరుగుతున్నా సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. గుర్రంపోడు మండలంలో తాజాగా వెలుగుచూసిన ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
ఏం జరిగిందంటే..?
నల్లగొండ జిల్లాలోని గుర్రంపోడు మండలంలో ప్రభుత్వం అందిస్తోన్న రేషన్ కార్డు లబ్ధిదారుల కుటుంబాల సంఖ్య అక్షరాల 13,742 ఉన్నాయి. అయితే గుర్రంపోడు మండలంలోని పలువురు డీలర్లు, అక్రమార్కులు ఏకమై.. రేషన్ కార్డు స్థానంలో స్మార్ట్ కార్డు వచ్చిందని, సదరు నకిలీ కార్డును తీసుకోకపోతే సంక్షేమ పథకాలన్నీ కట్ అవుతాయంటూ పుకార్లు పుట్టించారు. దీంతో పేద ప్రజలు స్మార్ట్ కార్డుల కోసం ఎగబడి మరీ తీసుకున్నారు.
అయితే పాత రేషన్ కార్డు స్థానంలో వచ్చిన స్మార్ట్ కార్డు తీసుకోవాలంటే.. ఒక్కో కార్డుకు రూ.200 చెల్లించాల్సి ఉంటుందని, కొంతమంది డీలర్ల ద్వారా కార్డులు జారీ చేశారు. ఇలా మండలం మొత్తంలో దాదాపు రూ.27లక్షలు వసూలు చేసేందుకు స్కెచ్ వేసినట్టు సమాచారం. గుర్రంపోడు మండలంలో ఇంత జరుగుతున్నా మండల స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
అధికారులకు తెలిసే జరిగిందా..?
నకిలీ రేషన్ కార్డుల వ్యవహారంలో ఓ మండల స్థాయి అధికారితోపాటు ఆరుగురు రేషన్ డీలర్లు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఇందులో ఓ రేషన్ డీలర్‌దే కీలక పాత్ర కావడం గమనార్హం. ఏ గ్రామంలో అనివార్య కారణాలతో రేషన్ డీలర్ స్థానం ఖాళీ అయితే.. సదరు రేషన్ డీలర్‌కే ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించడం అక్కడ పరిపాటిగా మారినట్టు సమాచారం. ఇదిలావుంటే.. ఇంత జరిగినా సదరు రేషన్ డీలర్లను గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు.
ఈ వ్యవహారంపై బీసీ సంఘం నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఏదీ ఏమైనప్పటికీ గుర్రంపోడు మండలంలో ఏకంగా నకిలీ రేషన్ కార్డులు ముద్రించి డబ్బు వసూలు చేయడమనేది మాములు విషయం కాదనే చెప్పాలి. అయితే ఈ వ్యవహారంలో అసలు నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
- వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ
గుర్రంపోడు మండలంలో వెలుగుచూసిన నకిలీ రేషన్ తయారీ కార్డుదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అందుకు సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా కార్డులు జారీ చేయడంపై పీడీఎస్ కంట్రోల్ చట్టం ఆధారంగా చర్యలకు సిద్ధం చేశాం.