- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పీడ్ పెంచిన సిట్.. కీలక నిందితుడు రమేష్ కస్టడీ కోసం పిటిషన్!
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాప్రతాల లీకేజీ కేసులో అరెస్టయిన రమేశ్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ సిట్అధికారులు శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్దాఖలు చేశారు. ఆశించినంత వేగంగా ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో విచారణ జరగటం లేదని ఇటీవల హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సిట్అధికారులు దర్యాప్తు వేగాన్ని పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రవికిశోర్నుంచి ఏఈఈ సివిల్, జనరల్నాలెడ్జ్, డీఏఓ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు కొని.. అభ్యర్థులకు అమ్మిన వరంగల్జిల్లా విద్యుత్‌శాఖ డీఈ రమేశ్‌ను ఇటీవల అరెస్టు చేశారు.
విచారణలో హైదరాబాద్అశోక్నగర్లోని ఓ కోచింగ్సెంటర్లో ఫ్యాకల్టీగా పని చేస్తున్న రమేశ్పరీక్షలు జరగటానికి ముందే పదకొండు మంది అభ్యర్థులతో ఇరవై లక్షల రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకుని ప్రశ్నాపత్రాలను వారికి అందచేసినట్టు వెల్లడైంది. దాంతోపాటు మరో 30మందితో బేరం కుదుర్చుకుని హైటెక్పద్దతిలో వారితో మాస్కాపీయింగ్జరిపించినట్టుగా తేలింది. ఈ క్రమంలో రమేశ్‌ను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ అతన్ని కస్టడీకి అనుమతించాలని సిట్అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్దాఖలు చేశారు. దీనిపై శనివారం కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది.
కలిపి విచారించాలని..
సిట్వర్గాలతో మాట్లాడగా.. రవికిశోర్, రమేశ్‌లను కలిపి విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికే రవికిశోర్‌ను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఇద్దరిని కలిపి విచారిస్తే ప్రశ్నాపత్రాలు ఎంతమంది చేతుల్లోకి వెళ్లాయి..? ఎంత మొత్తంలో డబ్బు తీసుకున్నారు..? అన్న వివరాలు వెలుగు చూస్తాయని చెప్పారు.