Tirumala : తిరుమల కల్తీ లడ్డూ కేసులో సిట్ కీలక పురోగతి !

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-15 08:01:30.0  )
Tirumala : తిరుమల కల్తీ లడ్డూ కేసులో సిట్ కీలక పురోగతి !
X

దిశ, వెబ్ డెస్క్ : కల్తీ లడ్డూ(laddu) వివాదానికి సంబంధించి విచారణలో భాగంగా తిరుమల(Tirumala)లో సిట్(SIT) అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. శనగపప్పు పిండి పట్టడం, నెయ్యి సేకరణ, నాణ్యత తనిఖీకి ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను పరిశీలించారు. పోటు ఏఈవో మునిరత్నంతో మాట్లాడి రోజువారీ విక్రయాలు, పంపిణీ విధానం తెలుసుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరాచేసిన నెయ్యి కల్తీ జరిగిందన్న ఆందోళన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం విచారణకు సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు నియమించిన సిట్‌ అధికారులు సీబీఐ డైరెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. కల్తీ నెయ్యి కేసు విచారణలో తాము సేకరించిన సమాచారాన్ని సీబీఐ డైరెక్టర్ కు వివరించారు. అసలు ఈ నెయ్యి ఏఆర్ డెయిరీ తాయారు చేసింది కాదని సంచలన విషయాన్ని వెల్లడించారు.

టీటీడీతో ఏఆర్ డెయిరీ సంస్థ ఒప్పందం మేరకు లడ్డూ తయారు చేసేందుకు అవసరమైన నెయ్యిని సరఫరా చేయాలి. అయితే ఒప్పందానికి విరుద్ధంగా ఏఆర్ డెయిరీ నిర్వాహకులు వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించి.. తన ట్యాంకర్ల ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు సిట్ అధికారుల విచారణలో గుర్తించారు. లారీ వెళ్లే మార్గాలు, టోల్ గెట్ వద్ద ఆగిన సమయాలు ఇలా అన్ని ఆధారాలను సిట్ అధికారులు పక్కాగా సేకరించినట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసు విచారణ ఇప్పటికే కొలిక్కి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే సిట్ అధికారులు ఈ కేసును ఛేదించి లడ్డూ కల్తీ వ్యవహారంలో జరిగిన అక్రమాలను వెల్లడించే అవకాశముందని సమాచారం.

Advertisement

Next Story