- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
తెలంగాణలో మోగిన మరో ఎన్నికల సైరన్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు రోజులు అవ్వకముందే సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి డేట్ ఫిక్స్ అయ్యింది. సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అది పోస్ట్ పోన్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్‌లో డిప్యూటీ లేబర్ కమిషనర్ సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు సమక్షంలో జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, విప్లవ కార్మిక సంఘాలైన ఐఎఫ్‌టీయూ, ఇతర సంఘాల నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి ఏకాభిప్రాయానికి రావడంతో 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికుల ఓటరు లిస్ట్‌ను ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు.