- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రివర్సైన వ్యవహారం.. చిక్కుల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి!
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో పరిణామాలు కీలక మలుపు దిశగా కొనసాగుతున్నాయి. ఇవాళ సిట్ విచారణకు వెళ్లిన రేవంత్ రెడ్డి అధికారులకు తన ఆరోపణలపై ఆధారాలు సమర్పించానని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సిట్ ఖండించింది. తాను చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సిట్ పేర్కొంది. కేవలం పొలిటికల్ మోటీవ్‌గా మాత్రమే ఆయన సిట్ దర్యాప్తుకు వచ్చారని చెప్పింది.
ఈ కేసులో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారని రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ మేరకు ఆయనపై కేసు నమోదుపై న్యాయ సలహాను సిట్ కోరినట్లు తెలుస్తోంది. లీగల్ ఒపీనియన్ ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రాల లీక్ కేసు దర్యాప్తు ఉత్కంఠ రేపుతోంది.