మద్యం ప్రియులకు బిగ్ షాక్.. అత్యంత కీలకమైన రోజు వైన్సులు బంద్

by Hamsa |
మద్యం ప్రియులకు బిగ్ షాక్.. అత్యంత కీలకమైన రోజు వైన్సులు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: హోలీ పండుగ సందర్భంగా పోలీసు శాఖ మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. మార్చి 6న సాయంత్రం 6. గంటల నుండి 8వ తేదీ ఉదయం.6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రకటించారు. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో ద్విచక్ర వాహనాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు వ్యతిరేకంగా ప్రవర్తించకుండా ప్రజలు నడుచుకోవాలని తెలిపారు.

Advertisement

Next Story