- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భావోద్వేగాలకు పదును.. ప్రధాన పార్టీల స్ట్రాటజీ చేంజ్!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికలకు రెండు వారాలు సమయం ఉండటంతో పార్టీలు తమ ప్రచార పంతాను మార్చాయి. ఇప్పటి వరకు ప్రత్యర్థులను విధానాల పరంగా విమర్శించిన పార్టీలు భావోద్వేగాలకు పదును పెట్టాయి. హుజురాబాద్ ఉప ఉన్నికల ప్రచారం సందర్భంగా ఈటల కేసీఆర్ తనను అన్యాయంగా మంత్రి పదవి నుంచి అవమానకరంగా తొలగించారంటూనే.. ‘తమ బిడ్డను సాదుకుంటారో.. సంపుకుంటారో తేల్చుకోవాలని’ ఓటర్లను సెంటిమెంట్‌తో తమ వైపునకు తిప్పుకోవడంలో సఫలం అయ్యారు. సేమ్ ఇప్పుడు అలాంటి స్ట్రాటజీనే ప్రధాన పార్టీల కీలక నేతలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
టీపీసీసీ చీఫ్ కామెంట్స్ వ్యూహమిదేనా..?
తాజాగా రేవంత్ రెడ్డి సైతం ఇలాంటి కామెంట్స్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ‘సిద్ధిపేట నుంచి ఒకడు, సిరిసిల్ల నుంచి ఇంకొకడు, గజ్వేల్ నుంచి మరొకడు కొడంగల్‌కు గొడ్డలి తీసుకుని వస్తున్నారు’ అంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. వాళ్ల మోచేతి నీళ్లు తాగిన వాళ్లు ఈ కుట్రలో భాగస్వాములై సహకరిస్తున్నారంటూ ప్రజలను అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. మీరు పెంచిన చెట్టును గొడ్డళ్లతో నరకాలని చూస్తుంటే మీకు పౌరుషం లేదా? అంటూ పొలిటికల్ హీట్ పెంచారు.
బీఆర్ఎస్ నయా స్ట్రాటజీ..!
ఇక, మంత్రి కేటీఆర్ 15 రోజులు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఢిల్లీ పెద్దలు కుట్రలు చేస్తూన్నారంటూ వ్యాఖ్యనించారు. రెండు దఫాలు తెలంగాణ సెంటిమెంట్‌ను వాడిన బీఆర్ఎస్ ఈ సారి సమైక్య వాద పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నాయని ప్రజలు అలర్ట్‌గా ఉండాలని ప్రచారం చేస్తున్నాయి. తద్వారా ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు షిఫ్ట్ కాకుండా జాగ్రత్త పడుతున్నాయి. కాగా తమ వద్ద అస్త్రశస్త్రాలను యుటిలైజ్ చేసుకుంటున్న పార్టీలు, అభ్యర్థులు స్థానికంగా ఉన్న భావోద్వేగాలను తమ ప్రసంగాల్లో ఉండేలా చూసుకుంటున్నారు. మరి ఈ భావోద్వేగ ప్రసంగాలు పార్టీలకు ప్లస్ కానున్నాయా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.