- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: YS వివేకా హత్యపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా సృష్టిస్తోన్న ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకా ఆస్తులన్నీ సునీతా పేరు మీదే ఉన్నాయని తెలిపారు. ఆస్తుల కోసం వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి ఆయన కూతురు సునీత పేరు మీద ఆస్తులను వీలునామా రాశారని షర్మిల క్లారిటీ ఇచ్చారు.
ఇక, వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో దర్యాప్తు సంస్ధ సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో కడప ఎంపీ, సీఎం జగన్ తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించింది. అంతేకాకుండా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, వివేకా హత్య కేసు కీలక దశలో ఉన్న సమయంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆస్తుల కోసం వైఎస్ వివేకాను ఆయన కూతురు, అల్లుడే హత్య చేశారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపిస్తుండగా.. తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలతో ఎంపీ అవినాష్ రెడ్డి ఇరకాటంలో పడ్డారని చర్చ జరుగుతోంది.