- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఇటీవల మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ కారణంగా పురుషులు సీట్లు దొరక్క ఎంతో దూరం నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుందని విమర్శలు వస్తున్నాయి. కనీసం నిలబడే జాగా కూడా లేదని పురుషులు ఆర్టీసీపై ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్టీసీపై ఒత్తిడి పెరిగింది. అయితే ఒకప్పుడు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో రిజర్వ్ చేసిన సీట్లు ఇప్పుడు పురుషులకు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేయాలని ఆ సంస్థ యాజమాన్యం భావిస్తున్నది. పురుషులకు సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడ్డారు. ఇందుకోసం బస్సుల్లో ఉండే 55 సీట్లలో 20 సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుదో అని పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని డిపోల నుంచి మేనేజర్ల అభిప్రాయాలను ఉన్నతాధికారులు సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు పురుషులకు సీట్లు కేటాయిస్తే వ్యతిరేకత వస్తుందా? అనే ఆందోళన కూడా అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే దేశంలో సీనియర్ సిటిజన్స్, వికలాంగులు, మహిళలకు తప్ప పురుషులకు రిజర్వేషన్స్ చేసిన దాఖలాలు లేవు. మరోవైపు టిక్కెట్ కొన్న తమకు సీట్లు లేకపోతే ఎలా అంటూ పురుషులు బస్సుల్లో అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు పురుషులకు సీట్ల కేటాయింపు విధానం పరిశీలిస్తున్నారు. మరోవైపు బస్సుల సంఖ్యను అధికారులు పెంచేపనిలో ఉన్నారు.