మైనర్‌పై రేప్ కేసులో ఎల్బీ‌నగర్ కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి ఊహించని షాక్

by Shiva |   ( Updated:2024-05-09 13:28:58.0  )
మైనర్‌పై రేప్ కేసులో ఎల్బీ‌నగర్ కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి ఊహించని షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా 2017లో సంచలన సృష్టించిన సరూర్‌నగర్‌‌లో మైనర్ బాలికపై రేప్ కేసులో ఎల్బీనగర్ కోర్టు గురువారం సంచలన తీర్పును వెలువరించింది. కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్ ఖాజా మొయినుద్దీన్ (19)కు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.11 వేల జరిమానా కూడా విధించింది. బాధితురాలికి రూ.లక్ష నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. మే 2017లో సరూర్‌నగర్‌లోని కర్మన్‌ఘాట్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి మహ్మద్ ఖాజా మొయినుద్దీన్ (19) అనే వ్యక్తి అదే కాలనిలో నివాసం ఉంటున్న మైనర్ బాలికను చాక్లెట్ల ఆశ చూపి తన తన ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఖాజా మొయినుద్దీన్‌ను అరెస్టు చేశారు. ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న కోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించింది.

Advertisement

Next Story