తెలంగాణ బీజేపీపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

by srinivas |
తెలంగాణ బీజేపీపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని, ఆ పార్టీ పతన దశలో ఉందని ఎఐఎం అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా బీజేపీ బుల్డోజర్లపై ఆధారపడిందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దుష్ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. దుష్ప్రచారాలతో అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. తెలంగాణలో బీజేపీ ఆశలు నెరవేరడం కష్టమని చెప్పారు. అసోం సీఎం బిశ్వశర్మ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. లవ్ జిహాద్, యూనిఫామ్ కోడ్ అంటూ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోంలో యూనిఫామ్ కోడ్ అమలు చేయగలరా..? అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.

Advertisement

Next Story